సబ్ జైల్ లో మెడికల్ క్యాంపు

10-10-2026 | 04:58pm

లక్షేట్టిపేట,అక్టోబర్ 10 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా(Mancherial District) లక్షేట్టిపేటలో శనివారం వరల్డ్ మెంటల్ హెల్త్ డే(World Mental Health Day) ను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్(Narender Rathod), ఎన్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనీల్ ఆదేశాల మేరకు సబ్ జైల్(Sub-jail) లో  మెడికల్ క్యాంపు(Medical Camp) నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణ ఖైదీలకు  బీపి, షుగర్ పరీక్షలు(Blood pressure and blood sugar tests) చేసి మందులను  అందజేయడంతో పాటు వివిధ అంశాలపై సైక్రియాటిస్ట్ డాక్టర్ సునీల్ ఖైదీలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ వైద్య శిభిరం లో డిప్యూటీ జైలర్ బదావత్ స్వామి,హెచ్ఈఓ లక్మణ్ స్వామి, హెల్త్ అసిస్టెంట్ లు గఫూర్, ఇసాక్ అహ్మద్ , ఏఎన్ఎం సుజాత, జైలు సిబ్బంది, ఆశావర్కర్స్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు