దేశాయి బీడీ సెంటర్ ను నిజంపేట్ కు తరలించవద్దు

02-11-2026 | 11:01pm

కార్మిక నాయకులు ఉప్పల లక్ష్మణ్

చేగుంట నవంబర్ 02,విజయక్రాంతి: చేగుంట పట్టణ కేంద్రంలో గల దేశాయి బీడీ సెంటర్(Desai Beedi Center) ను చేగుంట నుండి నిజం పేట్ కు తరలించవద్దని  దేశాయి బీడీ మండల టేకెదారులు సోమవారం బ్రాంచ్ మేనేజర్ కి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ    జనవరి నుండి చేగుంట లో ఉన్న సెంటర్ ను నిజాంపేట్ సెంటర్ కు తరలించడం సరికాదని, ఇక్కడి నుండి నిజంపేట్ బ్రాంచ్  60 కిలోమీటర్లు,దూరం ఉన్నందున,రాను పోను 120 కిలోమీటర్లు, బీడీ గంపలు తీసుకురావడం,  వయసు రిత్యా  ఇబ్బందులు కలుగుతాయని, సెంటర్ ను ఇక్కడే ఉంచాలని వారు అన్నారు,

మరిన్ని వార్తలు