రాష్ట్రస్థాయిలో ఎంపికైన గీతా స్టూడెంట్
తూప్రాన్, నవంబర్ 5, (విజయక్రాంతి): జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ లో(District-Level Children’s Science Congress) రాష్ట్ర స్థాయికి ఎంపికైన గీతా విద్యార్థిని తూప్రాన్ గీతా స్కూల్ లో తొమ్మిదవ తరగతి విద్యను అభిశిస్తున్న విద్యార్థిని కె. నవ్యశ్రీ 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ మెదక్ జిల్లా స్థాయి సెమినార్ లో అద్భుత ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయికి ఎంపికయింది.
ఈ నేపద్యంలో నవంబర్ 4న బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ సెమినార్ లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను జల సముదాయం లో కరిగించి, శుద్ధిచేసే రసాయన పద్ధతిని చక్కగా వివరించడంతో జిల్లాస్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండంట్ పి. రామాంజనేయులు, చైర్మన్ పి. ఉష, డైరెక్టర్లు బి. రాఘవేందర్ గౌడ్, నారాయణ గుప్తా, భరత్, డాక్టర్ మౌనిక, ప్రిన్సిపాల్ అరుణ, ఇంచార్జి ప్రిన్సిపాల్ ప్రేమ్ రాజ్, సైన్స్ ఉపాధ్యాయులు నవ్య ను అభినందించారు.