29 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
చేగుంట నవంబర్ 06 (విజయక్రాంతి): చేగుంట మండల(Chegunta Mandal) కేంద్రంలోనీ రైతు వెదికలో లో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం(Kalyana Lakshmi and Shaadi Mubarak Scheme) కింద 29 మంది లబ్ధిదారులకు శుక్రవారం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(MLA Kotha Prabhakar Reddy), మార్కెట్ కమిటీ చైర్మన్ తాడేం వెంగళ్ రావు,చెక్కులను పంపిణీ చేశారు. పేదింటి ఆడపిల్లల వివాహాలకు కళ్యాణలక్ష్మి పథకం ఆర్థిక భరోసా కల్పిస్తోందని, లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బాల్ లక్మి, ఎంపీడీఓ చిన్న రెడ్డి, సర్పంచ్ స్రవంతి సతీష్ ,ఉపసర్పంచ్ రఫీ,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.