రైతుల కోసం ‘ప్రాజెక్ట్ హార్వెస్ట్’
హైదరాబాద్: జర్మన్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ (డాయిష్ గెసెల్‌షాఫ్ట్ ఫ్యూర్ ఇంటర్నేషనాలే జుసామెనార్‌బైట్ (జీఐజెడ్)) జీఎంబీహెచ్, పెప్సికో ఇండియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బేయర్ ఏజీకి చెందిన క్రాప్ సైన్స్ విభాగంలు భారతదేశంలో పునరుత్పాదక వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, మొక్కజొన్న ఆధారిత వ్యవసాయంపై ఆధారపడిన రైతు సమాజాల్లో వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాల సాగు సామర్థ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా రూపొందించిన ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య కార్యక్రమం హార్వెస్ట్(HARVEST) (హోలిస్టిక్ అగ్రికల్చరల్ క్లైమేట్ రెసిలియెన్స్ అండ్ వెర్సటైల్ ఎకోసిస్టమ్ స్ట్రెంగ్థెనింగ్ టెక్నిక్స్)ను నేడు ప్రకటించాయి.
జర్మనీ ఫెడరల్ మినిస్ట్రీ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (బీఎంజెడ్) తరఫున డెవలప్‌పీపీపీ కార్యక్రమం కింద అమలయ్యే హార్వెస్ట్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని రైతు సమాజాలతో కలిసి పనిచేయనుంది. ఈ భాగస్వామ్యం మరింత పటిష్టమైన, సుస్థిరమైన వ్యవసాయ ఉత్పత్తికి తోడ్పడేందుకు శాస్త్రీయ నైపుణ్యం, రైతు సామర్థ్య నిర్మాణం, ఆచరణాత్మక క్షేత్రస్థాయి చర్యలు , విలువ ఆధారిత సరఫరా వ్యవస్థ భాగస్వామ్యాన్ని ఈ కార్యక్రమం సమన్వయం చేయనుంది. మూడేళ్ల పాటు అమలులో ఉండే ఈ భాగస్వామ్య వ్యవధిలో శిక్షణ, సామర్థ్యాల పెంపు ద్వారా 35,000 మంది రైతులకు చేరువ కావాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.
బంగాళాదుంపల విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలో పెప్సికో, బేయర్ రెండు దశాబ్దాలకు పైగా భాగస్వాములుగా ఉన్నాయి. ఇప్పుడు జీఐజెడ్ భాగస్వామిగా చేరడం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైజ్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) పరిశోధన సహకారం అందించడంతో ఈ భాగస్వామ్యం మొక్కజొన్న సాగుకు కూడా విస్తరించింది. తద్వారా ఆహార వ్యవస్థ అంతటా పటిష్ఠత, సుస్థిరత, నూతన ఆవిష్కరణలకు బలం చేకూర్చటం లక్ష్యంగా పెట్టుకుంది.
థాయ్‌లాండ్‌లో (2021-2025) బంగాళాదుంపలు, వరి విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలపై దృష్టి సారించిన ప్రాజెక్టులోనూ పెప్సికో, జీఐజెడ్ కలిసి పనిచేశాయి. రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడం, పునరుత్పాదక వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లడం, ఉద్గారాలను తగ్గించడం వంటి అంశాల్లో నిర్మాణాత్మక జోక్యాలు, సమష్టి చర్యలు గణనీయమైన ఫలితాలను అందించగలవని ఆ కార్యక్రమం నిరూపించింది. ప్రాజెక్ట్ హార్వెస్ట్ ఈ అభ్యాసాలు, నిరూపితమైన నమూనా ఆధారంగా భారతదేశంలో మరింత విస్తృత స్థాయిలో ప్రభావం చూపేలా రూపొందించారు.