రైతుల సేవకే మార్కెట్ కమిటీ తొలి ప్రాధాన్యం
నూతన భవనాలు, గోదాములు, పలు పనులకు తీర్మానం.
నేరేడుచర్ల, నవంబర్ 06(విజయక్రాంతి): వ్యవసాయ మార్కెట్ కమిటీ(Agricultural Market Committee) నేరేడుచర్ల పాలకమండలి సర్వసభ్య సాధారణ సమావేశం శుక్రవారం ఘనంగా జరిగింది. చైర్ పర్సన్ రంగినేని స్పందన అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ చాంబర్, మీటింగ్ హాల్ నిర్మాణం, కార్యాలయ మెయింటెనెన్స్ పనులు, నాబార్డ్ గోదాము నిర్మాణం కోసం నూతన ప్రతిపాదనలను సంచాలకులు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, హైదరాబాద్ కు మరోసారి పంపాలని తీర్మానించారు.
నాబార్డ్ గోదాము కోసం పాలకవీడు మండలం గుడిగుంట్ల పాలెం గ్రామంలో మూడు ఎకరాల స్థలం కేటాయించేందుకు సంబంధిత అధికారులకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కొనతం వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మునగల భాస్కర్ రెడ్డి, సభ్యులు కర్ణం రామనరసయ్య, బుర్రి వెంకయ్య, సురోజు రవీంద్రచారి, ఊటుకూరు సైదులు, పల్లె కశయ్య, కత్తి శ్రీనివాస రెడ్డి, ధనవత్ సైదు, రామవత్ వశ్య నాయక్, చింతలచెర్వు ప్రియాంక, పోతురాజు జ్యోతి, రెబ్బా రమేష్, పోలా విశ్వనాధం, జిల్లా మార్కెటింగ్ అధికారి, కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.