మృతురాలి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం

25-11-2026 | 05:56pm

మానవత్వం చాటుకున్న తాజా మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త...

శివంపేట్ నవంబర్ 25 (విజయక్రాంతి): శివంపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన 3వ వార్డు సభ్యురాలు ఒగ్గు మైసమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె కుటుంబాన్ని ప్రముఖ సంఘ సేవకులు, తాజా మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త(Pabba Mahesh Gupta) పరామర్శించారు. మృతురాలి కుటుంబానికి అండగా నిలుస్తూ తన సొంత నిధుల నుంచి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుణంగారి రాజు, ఉపసర్పంచ్ శ్రావణి ప్రవీణ్, మాజీ సర్పంచ్ అశోక్, అధ్యక్షుడు లక్ష్మణ్, 1వ వార్డు సభ్యుడు సంజీవ్, ఆంజనేయులు, కుమార్, శ్రీశైలం, సాయి, మల్లేష్, మధు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు