రామాయంపేట కరాటే కీర్తి పతాకం!

20-09-2026 | 10:02pm

హైదరాబాద్ వేదికపై అదరగొట్టిన విద్యార్థులు.. 17 మందిలో 17 పతకాలు..

హైదరాబాద్‌లో జరిగిన 7వ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌(National Karate Championship Tournament)లో రామాయంపేట విద్యార్థులు సత్తాచాటారు. వరల్డ్ నాకామయ్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో రామాయంపేటకు చెందిన 17 మంది విద్యార్థులు పాల్గొని 9 గోల్డ్, 4 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ సాధించి మొత్తం 17 పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు. చిన్నారుల అద్భుత ప్రతిభతో రామాయంపేట పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది.

రామాయంపేట, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి):

హైదరాబాద్ వేదికగా జరిగిన 7వ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో రామాయంపేట కరాటే విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వరల్డ్ నాకామయ్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో రామాయంపేట నుంచి 17 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

పోటీల్లో 9 మంది గోల్డ్ మెడల్స్, 4 మంది సిల్వర్ మెడల్స్, మరో 4 మంది బ్రాంజ్ మెడల్స్ సాధించి మొత్తం 17 పతకాలను కైవసం చేసుకున్నారు. కఠోర సాధన, పట్టుదల, క్రమశిక్షణకు ఈ విజయాలు నిదర్శనంగా నిలిచాయి. జాతీయ స్థాయి వేదికపై రామాయంపేట విద్యార్థులు చూపిన ప్రతిభకు పలువురు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా రామాయంపేట కరాటే వ్యవస్థాపకులు రొయ్యల హరిప్రసాద్ విజేతలను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రామాయంపేటకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. బ్లాక్ బెల్ట్ మాస్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు శిక్షణ పొందుతూ ఈ ఘనత సాధించడం విశేషం.

మరిన్ని వార్తలు