శ్రీ గురుపీఠంలో మైసయ్య యాదవ్‌కు ఘన సన్మానం

25-11-2026 | 05:51pm

శివంపేట నవంబర్ 25 (విజయక్రాంతి): మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు గ్రామంలోని శిరిడీ సాయిబాబా గురు దత్తాత్రేయ ఆలయాన్ని హిమాలయ యోగి పరమహంస అవతార్ శ్రీశ్రీశ్రీ స్వామి మాధవానంద సరస్వతి మహరాజ్(Swami Madhavananda Saraswati Maharaj) సందర్శించారు. ఈ సందర్భంగా బుధవారం గురుపీఠంలో జిన్నారం రమాదేవి, శివకుమార్ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా అధ్యక్షులు అక్కమొల్ల మైసయ్య యాదవ్ పాల్గొన్నారు. 

రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మైసయ్య యాదవ్ సేవలను గుర్తించిన శివకుమార్ గౌడ్, స్వామివారి సమక్షంలో ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రజాసేవకుడిగా, సమాజ సేవకుడిగా రైతుల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ స్వామివారు ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు