సమాజంలో... యువత భాగస్వామ్యం ఎంతో కీలకము

11-10-2026 | 07:58pm

అభివృద్ధిలో యువత ముందంజలో ఉండాలి.                          

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యవర్గ సభ్యులు సిహెచ్ దశరథ్                  

జవహర్ నగర్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): సమాజంలో యువత భాగస్వామ్యం(Youth Participation) ఎంతో కీలకమని అభివృద్ధిలో యువత ముందు వరసలో నిలబడాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం(Telangana State Farmers' Association) కార్యవర్గ సభ్యులు సిహెచ్ దశరథ్ పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పరిధిలోని ఆదర్శనగర్లో సిపిఐ శాఖ పునర్నిర్మాణ మహాసభ ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాప్రా మండల కార్యదర్శి దర్శనం యాదగిరి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ దశరథ హాజరయ్యారు.

ఈ సందర్భంగా దశరథ మాట్లాడుతూ సమాజంలో సంఘంలో యువత భాగస్వామ్యం ఎంతో కీలకమని స్థానిక అభివృద్ధిలో యువత ముందు వరుసలో నిలబడాలని పిలుపునిచ్చారు. ఆదర్శనగర్ శాఖ పునర్నిర్మాణంలో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాప్రా మండల కార్యదర్శి దర్శనం యాదగిరి నూతన కమిటీ సభ్యులను ప్రకటించారు.

ముఖ్య కార్యదర్శిగా పోలోజు కిరణ్ కుమార్ సహాయ కార్యదర్శిగా గట్టు చిరంజీవి, కార్యవర్గ సభ్యులుగా పోలోజు బాలాచారి, వడ్ల పాండు, అశోక్ చారి, కృష్ణ, చెన్నయ్య తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు బస్తీ సమస్యలపై నిరంతరం శ్రమిస్తూ ప్రజా ప్రయోజనాల కోసం అందుబాటులో ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు