కులాలకతీతంగా దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు
కండ్లకోయ గ్రామ మాజి సర్పంచ్ కందాడి నరేందర్ రెడ్డి
మేడ్చల్ అర్బన్ అక్టోబర్ 11(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(Cyberabad Municipal Corporation) 299 వ డివిజన్ కండ్లకోయ మున్సిపల్(Kandlakoya Municipality) పట్టణంలో కులాలకతీతంగా,రాజకీయాలకు అతీతంగా దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలను కండ్లకోయ గ్రామ మాజి సర్పంచ్ కందాడి నరేందర్ రెడ్డి(Narender Reddy),ఎస్ రాజేందర్ ముదిరాజ్ ల ఆధ్వర్యంలో అమ్మవారిని పూజించి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించడం జరిగిందని చెప్పారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్ ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సుసంపన్నంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు.అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ గుండ్లపోచంపల్లి 299 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గర్సెల సురేందర్ ముదిరాజ్,మాజి ఉప సర్పంచ్ చిల్ల వెంకటేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గుండ్లపోచంపల్లి గ్రామ మాజి సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి.కాంగ్రెస్ పార్టీ మాజి కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్.గౌడవెల్లి గ్రామ మాజి సర్పంచ్ అప్పమ్మగారి జగన్ రెడ్డి.మాజి సర్పంచ్ బేరీ ఈశ్వర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు గువ్వ రవి ముదిరాజ్.కండ్లకోయ ముదిరాజ్ సంఘం నేతలు టి పెంటేష్ ముదిరాజ్.రామకృష్ణ.బిక్షపతి.మల్లేష్ గౌడ్.యాదయ్య.టి శ్రీనివాస్ ముదిరాజ్.వై రాజు.బాబుచందర్.వినోద్ గౌడ్.వీరస్వామి.తలారి వెంకటేష్ ముదిరాజ్. తదితరులు పాల్గొన్నారు...