వైభవంగా దుర్గామాత మండపం వద్ద హోమం
18-10-2026 | 08:52pm
ఘట్ కేసర్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని అవుషాపూర్ లో ఆదివారం శ్రీ దుర్గా దేవి ఉత్సవ కమిటీ(Sri Durga Devi Utsava Committee) ఆధ్వర్యంలో హోమం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి దీక్ష చేపట్టిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పన్నాల కొండల్ రెడ్డి, సత్యనారాయణ, పరశురాం, శ్రీనివాస్, వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.