ఘట్‌కేసర్ సర్కిల్‌లో నీటి సరఫరా, డ్రైనేజీ నిర్వహణ బాధ్యతలు

01-10-2026 | 07:48pm

హెచ్ఎండబ్ల్యూ-ఎస్ బి కు అప్పగింత

ఘట్ కేసర్, అక్టోబర్ 1 (విజయక్రాంతి) : ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలో నీటి సరఫరా, డ్రైనేజీ నిర్వహణ బాధ్యతలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు కు(Metropolitan Water Supply and Sewerage Board) అప్పగించే ప్రక్రియలో భాగంగా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎ. వాణి హెచ్ఎండబ్ల్యూ-ఎస్ బి జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ లతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో నీటి సరఫరా, డ్రైనేజీ నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించి, మొత్తం 74 మంది వాటర్‌మెన్‌తో పాటు 2 జెట్టింగ్ యంత్రాలను హెచ్ఎండబ్ల్యూ-ఎస్బి కు అప్పగించారు.

ప్రజలకు నీటి సరఫరా, డ్రైనేజీ సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రజల నుంచి వచ్చే నీటి సరఫరా, డ్రైనేజీ సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం వార్డుల వారీగా సంబంధిత హెచ్ఎండబ్ల్యూ-ఎస్బి  అధికారుల వివరాలను వెల్లడించారు.

నాగారం వార్డు –5 సాయి కిరణ్ గౌడ్, మేనేజర్ – 998991718,

ఘట్‌కేసర్ వార్డు – 6 రామాదేవి, మేనేజర్  డీజీఎం– 9989998503,

ఎదులాబాద్ వార్డు –7 సాయి కిరణ్ గౌడ్, మేనేజర్ – 998991718

పోచారం వార్డు – 8 నవ్య, మేనేజర్ – 9154297412

ప్రజలు తమ వార్డుల పరిధిలో నీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలు తలెత్తినప్పుడు సంబంధిత అధికారులను సంప్రదించి ఫిర్యాదులను తెలియజేయవచ్చని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు