సివిల్ కేసుల్లో జోక్యం..? సీఐపై సస్పెన్షన్
ఘట్కేసర్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): ఘట్కేసర్ పోలీస్ ఇన్స్పెక్టర్ బాలస్వామిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు, భూవివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఆయనపై వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల సివిల్ కేసుల్లో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు సైతం రావడంతో ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించినట్లు సమాచారం.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఈ ఫిర్యాదులపై విచారణ జరిపించి నివేదిక తెప్పించుకున్నట్లు తెలిసింది. నివేదిక ఆధారంగా బుధవారం రాత్రి బాలస్వామిని సస్పెండ్ చేసినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, సస్పెన్షన్కు సంబంధించిన అధికారిక ఉత్తర్వుల వివరాలు వెల్లడికావాల్సి ఉంది. బాలస్వామి గత ఏడాది ఆగస్టు 31న ఘట్కేసర్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, తీసుకున్న చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.