SIR ప్రక్రియపై సుప్రీం ఫోకస్.. ఓట్ల తొలగింపు ఆరోపణలపై నేడు విచారణ

15-10-2026 | 08:41am

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని, భారీ సంఖ్యలో ఓట్లను తొలగించారనే ఆరోపణలపై ఇండియా కూటమి నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

ఎస్ఐఆర్‌ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ఓటర్ల హక్కులకు భంగం కలుగుతోందని పేర్కొంటూ కూటమి నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఓట్ల తొలగింపు ఆరోపణలు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన అంశాలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లనున్నారు. విచారణలో న్యాయస్థానం ఎలాంటి అంశాలను పరిశీలిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు