అనుమతి లేకుండా బోర్లు వేస్తే క్రిమినల్ కేసులు
తహసీల్దార్ చంద్రశేఖర్ హెచ్చరిక
ఘట్కేసర్,(విజయక్రాంతి): ఘట్కేసర్ మండల(Ghatkesar Mandal) పరిధిలో ప్రభుత్వ అనుమతి లేకుండా బోర్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ చంద్రశేఖర్(Ghatkesar Tahsildar Chandrashekar) హెచ్చరించారు. అనుమతులు లేకుండా బోర్లు వేస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు బోరు వాహనాల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. బోర్లు వేయాలనుకునే వారు ముందుగా మీ సేవ కేంద్రాల ద్వారా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి బోర్లు వేస్తే ఇంటి యజమానులతో పాటు బోరు వాహనాల యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.