ఏసీబీ దాడులు చేసినా మారలే?
- అక్రమ నిర్మాణాలు సీజ్
- సెటిల్ కాగానే తొలగింపు
- అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు
- n ఉన్నతాధికారుల పేరు దుర్వినియోగం
మేడ్చల్, సెప్టెంబర్ 11(విజయ క్రాంతి): ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయం(Yellampet Municipal Office)లో పనిచేస్తున్న ఒక అధికారి గత సంవత్సరం సెప్టెంబర్ 27న లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల(ACB officials)కు చిక్కాడు. రూ. ఐదు లక్షలు డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో ఏడాదిలోనే ఒక అధికారి ఏసీబీకి చిక్కాడనే భయం అధికారులు కనిపించడం లేదు. అమ్యామ్యాలు ఇవ్వనిదే భవన అనుమతులు ఇవ్వడం లేదు.
అంతేగాక ఒక అడు గు ముందుకేసి ఎవరేమనుకుంటే మాకేమీ మాకు మాత్రం డబ్బులు కావాలని అందరికీ తెలిసేలా బహిరంగంగా వ్యవహరించడం విస్మయం కలిగిస్తోంది. అక్రమ నిర్మాణమని సీజ్ చేయడం, నిర్మాణదారులు వచ్చి కలువగానే సెటిల్ చేసుకోవడం పరిపాటిగా మా రింది. ఎల్లంపేటలో ఎలాంటి అనుమతులు లేకుండా అరుణ గోదాం నిర్మిస్తున్నారు. భారీ గోదాం నిర్మాణానికి 40 అడుగుల రోడ్డు ఉంటేనే అనుమతి లభిస్తుంది. ఈ భారీ గోదాంకు 40 అడుగుల కంటే తక్కువగా, రోడ్డు ఇరుకుగా ఉంది.
ఇక్కడ గోదాం నిర్మాణానికి(Warehouse construction) అనుమతి రాదు. దీంతో యజమాని అధికారులతో మాట్లాడుకుని పనులు మొదలుపెట్టాడు. గ్రామ పంచాయతీగా ఉ న్న సమయంలో పనులు ప్రారంభమయ్యా యి. మున్సిపాలిటీగా మారిన తర్వాత అధికారులు హడావిడి చేయగానే వారిని సైతం కలిశాడు. వచ్చిన ప్రతి అధికారికీ ఎంతో కొంత సమర్పించుకున్నాడు. ఉత్తర తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యే సైతం అధికారు లకు పలుమార్లు ఫోన్ చేశాడు. మున్సిపాలిటీ ఏర్పడిన ఏడాదిన్నరలోనే తరచూ అధి కారులు బదిలీ అవుతున్నారు.
అధికారులందరికీ అరుణా గోదాం కల్పతరువుగా మా రింది. కొత్తగా వచ్చిన అధికారుల కన్ను అరు ణ గోదాం మీద పడింది. మున్సిపల్ అనుమతి లేదని గోదామును సీజ్ చేశారు. అనుమతి లేకుండా నిర్మించినందున నిబంధనల ప్రకారం కూల్చివేయాలి. 40 అడుగు ల రోడ్డు లేనందున అనుమతి ఇవ్వడానికి కూడా వీలు లేదు. కానీ కొన్ని రోజుల్లోనే సీ లు తొలగిపోయింది.
యధావిధిగా చివరి ద శ పనులు జరుగుతున్నాయి. రాజ బొల్లారం లో కూడా ఇలాగే జరిగింది. మెడిసిటీ ఆసుపత్రి వెళ్లే దారిలో భారీ గోదాం అనుమతి లేకుండా నిర్మిస్తుండగా, అధికారులు వెళ్లి సా మాగ్రి సీజ్ చేశారు. యజమాని మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి అధికారులను కలవగానే రెండు గంటల్లోనే పనులు ప్రారంభ మయ్యాయి. ప్రస్తుతం గోదాం నిర్మాణం పూర్తయింది.
ఉన్నతాధికారి పేరు దుర్వినియోగం
జిల్లాలో స్థానిక సంస్థలకు చెందిన ఉన్నతాధికారికి మంచి పేరు ఉంది. నిజాయి తీపరుడిగా, మానవత్వం ఉన్న అధికారిగా పేరుపొందారు. ఎవరైనా వివిధ సమస్యల మీద వెళ్లి కలిసి నప్పుడు అహంకారం లేకుండా ఓపికగా విని సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. ఎల్లంపేట మున్సిపల్ అధికారులు ఈ అధికారి పేరును దుర్వినియోగం చేస్తున్నారు. అరుణ గోదాం అను మతి లేదని సీజ్ చేసి ఆ తర్వాత తొలగించడంతో ఏ విధంగా సక్రమమైందని, దీని వెనుక ఏదో జరిగిందని మున్సిపల్ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విషయమై మీడియా ప్రతినిధులు మున్సిపల్ అధికారులను వివరణ కోరగా ఉన్నతా ధికారికి లేక రాసి ఆయన అనుమతితో చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు. మున్సిపల్ అధికారులే సీజ్ చేసి ఆ తర్వాత తొలగించి ఉన్నతాధికారికి లేఖ రాసి చర్యలు తీసుకుంటామనడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అరుణ గోదాం సీజ్ తొలగించక ముందు ఉన్నతాధికారికి లేఖ రాస్తే బాగుండేదని అంటున్నారు. ఎల్లంపేట మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, వీటిని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. అంతేగాక కలెక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.