జవహర్ నగర్ లో ఘోరం
మల్కారం క్వారీలో మునిగి ఇంటర్ విద్యార్థి మృతి
దమ్మాయిగూడలో విషాదం.. ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువకుడు
జవహర్ నగర్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): మల్కారం క్వారీలో(Malkaram Quarry) ఈతకు వెళ్లిన 17 ఏళ్ల విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్(Jawahar Nagar Police Station) పరిధిలో గల దమ్మాయిగూడలోని సాయిప్రియ కాలనీకి చెందిన ముమ్మారెడ్డి ప్రణవ్ సాయి(Mummareddy Pranav Sai) (17) చేర్యాలలోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలలో(Geethanjali Engineering College) సీఎస్ఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 9న కళాశాలకు వెళ్లిన ప్రణవ్ సాయి, సాయంత్రం తన స్నేహితులతో కలిసి మల్కారం క్వారీ వద్దకు ఈతకు వెళ్లాడు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి తల్లి ముమ్మారెడ్డి హేమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.