సుల్తానాబాద్‌లో గణేశుడికి మహా నైవేద్యం
171 నైవేద్యాలు సమర్పించిన భక్తులు...
సుల్తానాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఆది దేవుడైన గణేశుడికి భక్తులు మహా నైవేద్యం సమర్పించారు, 171 రకాల నైవేద్యాలను సమర్పించి భక్తిని చాటుకున్నారు, ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య భవన్ లో (Arya Vaishya Bhavan)గణేశుడి వద్ద జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, ప్రత్యేకంగా తయారు చేసిన వివిధ రకాల ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆర్యవైశ్య భవన్ భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. గణేషుడు వద్ద ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్ లక్ష్మి , కొమురవెల్లి అక్షిత హరీష్ దంపతులు పూజలో పాల్గొనగా అర్చకులు పారువెల్ల అభిషేక్ శర్మ దంపతులచే పూజలు చేయించారు, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, భక్తులు పాల్గొన్నారు....