ట్రాఫిక్, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం

30-10-2026 | 11:37pm

మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధి పీర్జాదిగూడలోని ఒక షోరూమ్‌లో నిర్వహించిన ‘అరైవ్ అండ్ అలైవ్’ కార్యక్రమం('Arrive and Alive' program)లో ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలకు శుక్రవారం మేడిపల్లి సిఐ డి.జలంధర్ రెడ్డి(Medipally CI D. Jalandhar Reddy) అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సెక్టార్ ఎస్ఐ, తో పాల్గొని  సుమారు 100 మందితో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు