అత్యంత వైభవంగా సద్దుల బతుకమ్మ సంబురాలు

18-10-2026 | 08:49pm

ఘట్ కేసర్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్ ప్రాంత ప్రజలు ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma) సంబురాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఆయా ప్రాంతాలలోని కూడళ్ల వద్ద మహిళలు బతుకమ్మలను పెట్టి ఆటపాటలతో అలరించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా గ్రామాలలో ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు. విధ్యుత్ లైటింగ్, డీజీఏ సౌండ్ సిస్టంలతో పాటు బతుకమ్మల నిమజ్జన ఏర్పాట్లను చేశారు. ఆయా ప్రాంతాలలో మహిళలు, యువతులు బతుకమ్మలతో పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని ఆట పాటలతో హోరెత్తించారు. మహిళలతో పాటు స్థానిక నాయకులు బతుకమ్మ ఆటాడి చూపరులను సంతోషపరిచారు. గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొని ఈ బతుకమ్మ సంబురాలను తిలకించారు. ఆనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

మరిన్ని వార్తలు