అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల కఠిన చర్యలు

16-09-2026 | 10:09pm

రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత – కేసులు నమోదు

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ పోలీస్ స్టేషన్(Mallapur Police Station) పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై(Illegal sand transportation) పోలీసులు చర్యలు చేపట్టారు. బుధవారం సంగెమ్ శ్రీరాంపూర్ గ్రామ శివారులో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మల్లాపూర్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం సదరు ట్రాక్టర్లపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా మల్లాపూర్ ఎస్సై ఏ. అనిల్(Mallapur SI A.Anil) మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తవ్వడం, నిల్వ చేయడం, తరలించడం లేదా రవాణా చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.

ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి మినహాయింపు లేకుండా చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాకు వాహనాలను వినియోగించే యజమానులు, డ్రైవర్లపై కూడా నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని తెలిపారు.ఇసుక అక్రమ రవాణాకు పాల్పడేవారు ఇకపై చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని ఎస్సై స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు