బొలెరో ఢీకొని నవదంపతులకు తీవ్ర గాయాలు
16-09-2026 | 10:09pm
తరిగొప్పుల, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): నర్మెట మండల(Narmetta Mandal) కేంద్రానికి చెందిన మడికొండ సతీష్ (28), రాధిక (23) దంపతులకు కొన్ని నెలల క్రితం వేలేరు మండలం షోడాషాపల్లిలో వివాహం జరిగింది. బుధవారం రోజున రాధిక వాళ్ల పుట్టిల్లు శాలపల్లికి వెళుతుండగా తరిగొప్పుల మండలం నర్సాపూర్, అబ్దుల్ నాగారం గ్రామాల మధ్య ఉన్న మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న కోళ్ల లోడ్ బొలెరో వాహనం ఢీకొనడంతో నవదంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.