జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికలు

15-09-2026 | 11:13pm

నిర్వాహక కార్యదర్శి జోన్స్,  రాజశేఖర్

జవహర్ నగర్,(విజయక్రాంతి): జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఈ నెల 20వ తేదీన ఎంపిక ప్రక్రియ చేయనున్నట్లు నిర్వాహక కార్యదర్శి స్టాన్లీ జోన్స్ కూరపాటి రాజశేఖర్(Managing Secretary Stanley Jones Kurapati Rajasekhar)లు మంగళవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ధ్రువపత్రాలతో తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల(Telangana State Sports School) హకీంపేటలో రాజశేఖర్ కు రిపోర్టు చేయాలని పేర్కొన్నారు.

అండర్ 14 16 విభాగాల్లో షార్ట్ ఫుట్, త్రోబాల్, అండర్ 18లో లాంగ్ జంప్, అండర్ 20 లో లాంగ్  జంప్, త్రిపుల్ జంప్ పురుష స్త్రీ అభ్యర్థులు ఈనెల 20వ తేదీన ఉదయం ఏడు గంటలకు హాజరు కావాలని తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఈనెల 26, 27వ తేదీన నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలు హనుమకొండలోని జవహర్ లాల్  నెహ్రూ స్టేడియంలో పాల్గొంటారన్నారు.

మరిన్ని వార్తలు