టీపీసీసీ అధ్యక్షుడికి శుభాకాంక్షలు
ఘట్ కేసర్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Telangana Pradesh Congress Committee) అధ్యక్షుడిగా రెండు సంవత్సరాలుగా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud)కు కాంగ్రెస్ ముఖ్య నేతలు(Congress leaders) శుభాకాంక్షలు తెలిపారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధుల బృందం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేసింది.
రాబోయే కాలంలో కూడా ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నిరంతరం పోరాడుతూ ముందుకు సాగాలని నేతలు ఆకాంక్షించారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో పోచారం డివిజన్ అన్నోజిగూడ కు చెందిన టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి, మాజీ కౌన్సిలర్ బాలగౌని వెంకటేష్ గౌడ్, మీడియా కోఆర్డినేటర్ శ్రీకాంత్ యాదవ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవి యాదవ్ ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.