‘చీన్ టపాక్ డమ్ డమ్’

07-10-2026 | 05:15am

గవిరెడ్డి శ్రీనివాస్(Gavireddy Srinivas) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘చీన్ టపాక్ డమ్ డమ్(Cheen Tapak Dum Dum)’. ఈ చిత్రానికి వైఎన్ లోహిత్ దర్శకుడు. విలేజ్ టాకీస్ బ్యానర్‌పై శ్రీను నాగులపల్లి నిర్మిస్తున్నారు. ఇందులో గవిరెడ్డి సరసన బ్రిగిడ సాగా కథానాయికగా నటిస్తోంది. షఫీ, దువ్వాడ మాధురి, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను టాలీవుడ్ హీరో అడివి శేష్ ఆవిష్కరించారు.

ఇవి కూడా చదవండి: అమ్మాయిల కాలేజీలో అబ్బాయి చేరితే..?

‘ఫస్ట్ క్రాకర్’ పేరుతో విడుదల చేసిన ఈ మోషన్ పోస్టర్‌లోని ‘కాన్ సెన్స్ క్రౌన్స్ వెన్ కామన్ సెన్స్ డ్రౌన్స్’ అనే క్యాప్షన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. జొన్నాడ గ్రామంలో సాగే ఈ కథ కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలతో రూపుదిద్దుకుంటోందని మోషన్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రానికి డీవోపీ: సెంథిల్ కుమార్; సంగీతం: పీఆర్; నేపథ్య సంగీతం: సురేశ్ బొబ్బిలి; పాటలు: తిరుపతి జావన; ప్రొడక్షన్ డిజైన్: ఏఎస్ ప్రకాశ్. 

మరిన్ని వార్తలు