అమ్మాయిల కాలేజీలో అబ్బాయి చేరితే..?

07-10-2026 | 05:15am

ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్(Egan, Sridevi, Femina George) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్, లవ్ ఎంటర్‌టైనర్ ‘హైకూ(Haiku)’. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డాక్టర్ డీ అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మించారు. యువరాజ్ చిన్నసామి(Yuvraj Chinnasamy) రచనాదర్శకత్వంలో తెర కెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. అమ్మాయిల కాలేజ్‌లో అబ్బాయి జాయిన్ అవ్వడం, కాలేజ్ మొత్తానికి ఒకే అబ్బాయి ఉండటం అనే విచిత్ర పరిస్థితులతో ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి: ‘చీన్ టపాక్ డమ్ డమ్’

‘ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నప్పుడు.. బాగా చూసుకోవాలి.. వన్స్ తను వదిలేసి వెళ్లిపోవాలని డిసైడ్ అయితే కాళ్లు పట్టుకుని బతిమిలాడినా ఉపయోగం ఉండదు’ అనే డైలాగ్‌తో కథ ఏంటో చెప్పేశారు. మొత్తానికి రొమాంటిక్ ప్రపంచాన్ని, అందమైన ప్రేమకథను ప్రేక్షకుల తీసుకొస్తున్నారనేది అర్థమవుతోంది. అక్టోబర్ 23న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి కెమెరామెన్: ప్రియేశ్ గురుస్వామి; సంగీతం: సిద్ధుకుమార్; ఎడిటర్: శక్తి ప్రణేశ్; ఆర్ట్: ప్రేమ్. 

మరిన్ని వార్తలు