అన్నింటితో సరిపోయారు ఇద్దరూ

07-10-2026 | 05:20am

మేఘాంశ్ శ్రీహరి, యశ్విన్ వేగేశ్న(Meghansh Srihari, Yashvin Vegesna) ప్రధాన పాత్రల్లో చిత్రం ‘సరిపోయారు ఇద్దరూ(Saripoyaru Iddaru)’. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఈ సినిమాను హ్యాపీ ఆక్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎంఎస్ వారాహి క్రియేషన్స్, శతమానంభవతి ఆర్ట్స్ బ్యానర్లపై సాదత్, ముని శివ నిర్మిస్తున్నారు. ఇందులో రాజేంద్రప్రసాద్, నరేశ్ వీకే, రిద్ధికుమార్, మేఘా చౌదరి కీలక పాత్రలను పోషిస్తున్నారు. అన్నపూర్ణ, రఘుబాబు, సుదర్శన్, ప్రవీణ్, ఆనంద్, రచ్చ రవి, శివన్నారాయణ, అన్షురెడ్డి, మణిచందన, సిజ్జు, భద్రం ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి: నభా, ధ్రువ.. కెమిస్ట్రీ!

తాజాగా ఈ మూవీ టీజర్‌ను టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) రిలీజ్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కథ, భావోద్వేగాలు, హాస్యం, ప్రేమ వంటి అన్ని రకాల అంశాలున్నాయని ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది. హీరో, హీరోయిన్ల లవ్‌ట్రాక్.. వైజాగ్ ఎపిసోడ్స్ సినిమాకు కీలకంగా ఉండబోతోన్నాయి. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించగా, సమీర్‌రెడ్డి సినిటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఎడిటర్ మధు కాగా, రామాంజనేయులు ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. 

మరిన్ని వార్తలు