నభా, ధ్రువ.. కెమిస్ట్రీ!
అందాల తార నభా నటేశ్(Nabha Natesh) ఈ ఏడాది ‘నాగబంధం(Nagabandham)’తో ప్రేక్షకులను పలుకరించింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరో ఆసక్తికర ప్రాజెక్టుతో రాబోతోంది. కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా(Dhruva Sarja) హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘కెమిస్ట్రీ’లో నభా హీరోయిన్‌గా అలరించబోతోంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. విశాల్ ఆత్రేయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి: అన్నింటితో సరిపోయారు ఇద్దరూ
కెరీర్ ఆరంభంలో రొమాంటిక్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నభా నటేశ్.. కొంత విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంతో అలరించనుంది. ధ్రువ, నభా మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ తాజా సినిమాలో హైలైట్‌గా నిలవనుంది. ఈ ఫ్రెష్ పెయిర్‌ను తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.