‘చంద్రయాన్’తో థియేటర్లలో నవ్వుల హంగామా
‘రాజు వెడ్స్ రాంబాయి(Raju Weds Rambai)’ సూపర్ హిట్ తర్వాత నిర్మాత వేణు ఊడుగుల తన సమర్పణలో ‘చంద్రయాన్(Chandrayaan)’ టైటిల్‌తో మరో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్‌పై(Simba Screen Stories banner) ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 13న రిలీజ్‌కు రాబోతోంది.
ఈ సినిమా రాకెట్ రివీల్ ఈవెంట్‌ను డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి అతిథిగా హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు వేణు ఊడుగుల మాట్లాడుతూ.. ‘ఈ సినిమా చూసిన తర్వాత నచ్చి ప్రెజెంటర్ గా ఉండేందుకు ముందుకొచ్చాను. ఎంతో ఇన్నోసెన్స్ ఉన్న సినిమా ఇది. లాజిక్స్ ఉండవు. సెన్స్ ఉండని నాన్ సెన్స్ కామెడీ ఉంటుంది. కానీ వెరీ సెన్సిబుల్ మూవీ ఇది’ అన్నారు. హీరో శివకుమార్ ధీకొండ మాట్లాడుతూ.. ‘నేను కొత్త హీరో కాబట్టి కొంత భయంగా ఉండేది.
కానీ ప్రతి సందర్భంలో నాకు మా మూవీ టీమ్‌తో పాటు మీడియా మిత్రులు సపోర్ట్‌గా నిలిచారు’ అన్నారు. హీరోయిన్ స్వప్న ప్రియదర్శిని మాట్లాడుతూ.. ‘చంద్రయాన్ నాకు స్పెషల్ మూవీ. ఇది నా తొలి సినిమా కావడం సంతోషంగా ఉంది’ అన్నారు. డైరెక్టర్ శ్రీనాథ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘ఊరిలోని నలుగురు కుర్రాళ్లు రాకెట్ తయారు చేసి చంద్రుడి మీదకు వెళ్దామని డిసైడ్ అవుతారు. ఈ నలుగురు సినిమాలో చేసే హంగామా ఆగదు. థియేటర్స్‌లోకి మీరు అడుగుపెట్టగానే నవ్వుల హంగామా స్టార్ట్ అవుతుంది’ అన్నారు. ప్రొడ్యూసర్ ప్రవీణ్ మొలక మాట్లాడుతూ.. ‘మా టీమ్ అంతా కష్టపడి ఒక కొత్త తరహా ప్రయత్నం చేశాం’ అన్నారు.