‘డ్రాగన్’ షూటింగ్.. ఎన్టీఆర్ రీ-ఎంట్రీ ఎప్పుడంటే?
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’(Dragon) షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. భుజానికి గాయం కావడంతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆయన షూటింగ్కు కొంత విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఇప్పటికే సినిమా షూటింగ్లో దాదాపు 70 శాతం పూర్తయినట్లు సమాచారం. ఇక అక్టోబర్ మొదటి వారం నుంచి ఎన్టీఆర్ తిరిగి షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ‘డ్రాగన్’ కోసం సుదీర్ఘ షెడ్యూల్ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలతో పాటు ఎన్టీఆర్ పాల్గొనే ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. భారీ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.