మూడు నెలలు నరకం చూశా.. కియారా ఎమోషనల్!

14-11-2026 | 01:38pm

ప్రెగ్నెన్సీ కష్టాలను బయటపెట్టిన కియారా.. వైరల్ అవుతున్న కామెంట్స్!

బాలీవుడ్ నటి కియారా అద్వానీ తన మాతృత్వ ప్రయాణంలోని కష్టమైన రోజులను గుర్తుచేసుకుంది. తొలి ప్రెగ్నెన్సీ సమయంలో ఎదురైన శారీరక, మానసిక ఇబ్బందుల గురించి తాజాగా ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు తనకు ఎంతో సవాలుగా మారాయని వెల్లడించింది. ఆ సమయంలో భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో పాటు తన కుటుంబంలోని మహిళల మద్దతు ఎంతో అవసరమైందని చెప్పుకొచ్చింది.

గతంలో కరణ్ జోహార్ హోస్ట్ చేసిన Coffee With Karan షోలో పాల్గొన్నప్పుడు కియారా ఈ విషయాలను వెల్లడించింది. తొలి రోజుల్లో వికారం, Hormonal Changes కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. మొదట్లో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని తాను, సిద్ధార్థ్ నిర్ణయించుకున్నామని వివరించింది. అయితే పరిస్థితులు కష్టంగా మారడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు చెప్పింది. ఆ సమయంలో తన తల్లి, అత్తగారితో మాట్లాడాలని భర్త సిద్ధార్థ్‌కు స్పష్టంగా చెప్పినట్లు కియారా గుర్తుచేసుకుంది.

తన పరిస్థితిని అర్థం చేసుకుని ధైర్యం చెప్పే మహిళలు పక్కన ఉండాలని కోరుకున్నానని వెల్లడించింది. స్నేహితురాళ్లతో కలిసి కూర్చుని ఎన్నోసార్లు ఏడ్చేదానినని, వారు ఇచ్చిన Emotional Support తనకు ఎంతో బలాన్నిచ్చిందని తెలిపింది. మహిళల మధ్య ఉండే అనుబంధం, ఒకరి బాధను మరొకరు అర్థం చేసుకునే గుణం తనకు కష్టకాలంలో ఎంతో సహాయపడిందని కియారా పేర్కొంది. కాగా, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు ఈ ఏడాది సారాయా అనే పాప జన్మించింది. అక్టోబర్ 7న మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఈ జంట సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. చిన్నారి సారాయా చేతిలో బేబీ సాక్స్ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.

మరిన్ని వార్తలు