బతుకమ్మ పాటకు రాష్ట్రస్థాయి గుర్తింపు

17-10-2026 | 08:25pm

* ఆరేపల్లి బిడ్డకు మూడో బహుమతి

* దర్శకత్వం వహించి నటించిన దొడ్లే మనీషా పాటిల్‌కు అరుదైన గౌరవం

* గ్రామంలో హర్షాతిరేకాలు

పాపన్నపేట,అక్టోబర్17: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ పాటల పోటీల్లో(Bathukamma Festival Song Competition) ఆరేపల్లి గ్రామానికి చెందిన దొడ్లే మనీషా పాటిల్(Manisha Patil) సత్తా చాటారు. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్(Telangana Film Development Corporation) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన బతుకమ్మ పాటల పోటీల్లో ఆమె దర్శకత్వం వహించి, నటించిన ‘బుజ్జి బతుకమ్మ(Little Bathukamma)’ పాటకు మూడో బహుమతి లభించింది. రాష్ట్రస్థాయిలో ‘బుజ్జి బతుకమ్మ’ పాటకు గుర్తింపు లభించడంతో ఆరేపల్లి గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. తమ గ్రామానికి చెందిన మనీషా పాటిల్ ప్రతిభకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రజిత రాజశేఖర్‌తో పాటు గ్రామ ప్రజలు మనీషా పాటిల్‌ను అభినందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పాటకు గుర్తింపు తీసుకురావడం గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు