ఎవరికోసమో మారలేను!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న(Vijay Deverakonda, Rashmika Mandanna) జంటగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా(Period action drama) ‘రణబాలి(Ranabali)’. రాహుల్ సాంకృ త్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం అక్టోబర్ 16న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లను ము మ్మరం చేసింది. తాజాగా ఇంటర్వ్యూల్లో పాల్గొన్న రష్మిక.. తనపై వచ్చే సోషల్ మీడియాలో(Social Media) వచ్చే ట్రోలింగ్స్‌పై(Trolling) ధీటుగా స్పందించారు. “నేను నాలా ఉండటానికి ఎలాంటి నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు. నా ప్రవర్తన చాలా నేచురల్‌గా ఉంటుంది.
ఇవి కూడా చదవండి: మైసూరులో దాదా
అందరికీ నా పద్ధతి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరి అభిరుచులు ఒకేలా ఉండవు. ఎవరో సంతోషపడతారని నేను నా నిజాయితీని వదులుకోలేను. నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను, ఈ నిజాయితీగా ఉండటంతో చాలా సంతోషంగా ఉన్నా. నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం విజయ్ దేవరకొండ కాదు. రాహుల్ సాంకృత్యాయన్ తీసిన ‘శ్యామ్ సింగరాయ్’ చూసినప్పటి నుంచే ఆయనతో పనిచేయాలనుకున్నాను.
అలాగే ఈ కథ వినగానే చాలా నచ్చేసింది. ఇందులో నేను పోషించిన ‘జయమ్మ’ పాత్రకు చాలా ఎమోషనల్ డెప్త్ ఉంది. అయితే, ఈ సినిమాలో హీరోగా విజయ్ నటిస్తున్నాడని తెలిసినప్పుడు మాత్రం నా ఆనందం రెట్టింపయింది. చాలా కాలానికి మళ్లీ కలిసి నటించే అవకాశం రావడం నాకు సంతోషాన్నిచ్చింది” అని తెలిపారు రష్మిక.