మైసూరులో దాదా
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని(Gopichand Malineni) తెరకెక్కిస్తున్న చిత్రం ‘దాదా(Dada)’. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) కథానాయికగా నటి స్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మంగళవారం నుంచి మైసూరులో పునఃప్రారంభమైంది. ఇటీవల గాయపడిన బాలకృష్ణ కోలుకుని తిరిగి షూటింగ్ సెట్స్‌లో అడుగుపెట్టారు. కీలకమైన, లెన్తీ షెడ్యూల్‌లో ఆయన పాల్గొంటున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో ప్రధానంగా టాకీ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు. బాలాతోపాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ షూటింగ్‌లో పాల్గొంటుండగా, ఈ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్; డీవోపీ: అరవింద్ ఎస్ కశ్యప్ ఐఎస్‌సీ; డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా; ఫైట్స్: రామ్ రవివర్మ, వెంకట్; ఎడిటర్: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైన్: ఏఎస్ ప్రకాశ్.