ఫన్ ప్యాక్డ్ సినిమా

24-11-2026 | 05:10am

శ్రీ విష్ణు(Sri Vishnu) ‘ఫ్యామిలీ ప్యాక్(‘Family Pack’)’తో మరోసారి ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఎంటర్‌టైనర్‌లో సాక్షి మడోల్కర్ హీరోయిన్. నరేశ్ వీకే, అభిరామి, మురళీశర్మ, అన్నపూర్ణ, వెన్నెల కిషోర్, సుదర్శన్, సత్య, రోహిణి, గెటప్ శ్రీను, మురళీధర్‌గౌడ్, గోపరాజు విజయ్, బుల్లిరాజు (రేవంత్), శ్రీముక్త, రఘుబాబు, మాణిక్‌రెడ్డి, హరిప్రసాద్, ఇమ్మాన్యుయేల్, మధుమణి, గీతా సింగ్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ 2027 సంక్రాంతికి విడుదల కానుంది.

తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో ఒక కొత్త యాంగిల్ ఉంటుంది. ప్రేక్షకులు థియేటర్‌లో ఎంజాయ్ చేస్తారు. సినిమాను చాలా మంచి ఫన్ ప్యాక్‌తో సిద్ధం చేశాం. ఫ్యామిలీతో కలిసి ఫ్యాక్డ్ థియేటర్లో చూడండి” అన్నారు.

‘సంక్రాంతి రోజున ఈ సినిమా ప్రేక్షకులందరికీ హ్యాపీగా ఎంజాయ్ చేసేలా ఉంటుంద’ని డైరెక్టర్ రామ్ అబ్బరాజు చెప్పారు. హీరోయిన్ సాక్షి మడోల్కర్ మాట్లాడుతూ.. “ఈ సినిమా గురించి చాలా హ్యాపీగా, ఎక్సైటెడ్‌గా ఉన్నా. సంక్రాంతికి ‘ఫ్యామిలీ ప్యాక్’తో కలుద్దాం” అని తెలిపింది. డీవోపీ యువరాజ్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలితో పాటు పలువురు నటీనటులు ఈ వేడుకలో మాట్లాడారు. 

మరిన్ని వార్తలు