సంక్రాంతికి ‘పాకెట్ నావల్’

24-11-2026 | 09:14am

సినిమా తెరపై కనిపించే హీరోలు, హీరోయిన్లతో పాటు తెరవెనుక కష్టపడే సాంకేతిక నిపుణులకు కూడా గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ‘పాకెట్ నావల్’(Pocket Novel Movie) టీమ్ ప్రత్యేక ప్రయత్నం చేసింది. విజయ్ సేతుపతి(Vijay Sethupathi), మాళవిక మోహనన్(Malavika Mohanan) జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం(Directed by Thiagarajan Kumararaja) వహిస్తున్నారు. తాజాగా మాళవిక మోహనన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు.

ఇందులో సినిమాకు పనిచేస్తున్న కెమెరా, లైటింగ్, మేకప్, ఆర్ట్, ప్రొడక్షన్ విభాగాల సిబ్బందిని పరిచయం చేశారు. సాధారణంగా తెర వెనుకే ఉండిపోయే వారి శ్రమను ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు చూపించారు. ఇక ఈ సినిమాను 2027 జనవరి 14న సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.

తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో కన్నడ నటుడు రాజ్ బి. శెట్టి, కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ‘సూపర్ డీలక్స్’ తర్వాత విజయ్ సేతుపతి, త్యాగరాజన్ కుమారరాజా కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు