నానా పటేకర్ చివరి వీడియో వైరల్

08-10-2026 | 10:36am

“రేపు ఉంటానో లేదో తెలియదు”.. 4 రోజుల ముందు నానా చివరి మాటలు వైరల్

ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు నానా పటేకర్ (Nana Patekar) మరణంతో సినీ ప్రపంచం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. 75 ఏళ్ల నానా పటేకర్ అక్టోబర్ 8 గురువారం తెల్లవారుజామున గోవాలోని తన నివాసంలో Cardiac Arrestకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించినా ఆయనను కాపాడలేకపోయారు. వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు CPR చేసినప్పటికీ స్పందించలేదని మణిపాల్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ శేఖర్ సల్కర్ తెలిపారు. అయితే ఇప్పుడు Nana Patekar Last Video సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం.. మరణానికి కేవలం నాలుగు రోజుల ముందు జరిగిన తన చివరి పబ్లిక్ అపియరెన్స్‌లో నానా పటేకర్ స్వయంగా మరణం, జీవితం గురించి మాట్లాడటం. అక్టోబర్ 4న గోవాలోని డోనా పౌలాలో జరిగిన Samraat Club International కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. తెల్లటి కుర్తా, గమ్చాతో కనిపించిన నానా.. మాజీ గోవా సీఎం మనోహర్ పారికర్‌ను గుర్తు చేసుకుంటూ జీవితంలో మనం సాధించాల్సిన విషయాల గురించి మాట్లాడారు. 

ఈ సందర్భంగా నానా పటేకర్ చెప్పిన మాటలు ఇప్పుడు అభిమానులను కలచివేస్తున్నాయి. “మనం అందరం ఏదో ఒక రోజు వెళ్లిపోవాలి. నేను రేపు ఇక్కడ ఉంటానో లేదో నాకు తెలియదు” అని ఆయన అన్నారు. అంతేకాదు.. మనకు ఉన్న సమయంలో మనం నిజంగా చేయాలనుకున్నది చేస్తున్నామా? సమాజానికి మన వంతుగా ఏదైనా చేస్తున్నామా? అని తనను తాను ప్రశ్నించుకోవాలని చెప్పారు. నానా పటేకర్ మరణ వార్త బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన Last Public Appearanceకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో ఈ మాటలు మరింత వైరల్ అయ్యాయి. నాలుగు రోజుల క్రితం వేదికపై ఎంతో సాధారణంగా మాట్లాడిన నానా.. ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అభిమానులను షాక్‌కు గురిచేసింది.

నానా పటేకర్‌కు ఏం జరిగింది?

తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 8 తెల్లవారుజామున నానా పటేకర్ తన గోవా నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించారు. అనంతరం ఆయనను మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు CPR నిర్వహించినా ఫలితం లేకపోయింది. ఆయన మరణాన్ని వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై Medico-Legal Case (MLC) నమోదు కాగా, పోస్ట్‌మార్టం ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానం

Nana Patekar Movies అంటేనే విలక్షణమైన నటన, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ గుర్తొస్తాయి. 1978లో ‘గమన్’తో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత మరాఠీ, హిందీ చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. ‘పరిందా’, ‘ప్రహార్’, ‘తిరంగా’, ‘క్రాంతివీర్’, ‘ఖామోషి: ది మ్యూజికల్’, ‘అబ్ తక్ ఛప్పన్’, ‘రాజ్‌నీతి’ వంటి చిత్రాల్లో ఆయన నటనకు విశేష గుర్తింపు వచ్చింది. సీరియస్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన నానా.. Welcomeలో ‘ఉదయ్ శెట్టి’గా కామెడీ టైమింగ్‌తో మరో కోణాన్ని చూపించారు. దీంతో కొత్త తరం ప్రేక్షకులకు కూడా ఆయన మరింత దగ్గరయ్యారు. ఆయన ప్రత్యేకమైన గొంతు, డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్ సినీ అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించాయి. సినిమాలతో పాటు థియేటర్, దర్శకత్వం, సామాజిక సేవల్లోనూ నానా పటేకర్ తనదైన పాత్ర పోషించారు. భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను ఆయనకు Padma Shriతో పాటు మూడు National Film Awards సహా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. నానా పటేకర్ మరణంతో భారతీయ సినిమా ఒక విలక్షణమైన నటుడిని కోల్పోయింది. అయితే ఆయన పోషించిన పాత్రలు, చెప్పిన డైలాగులు, ముఖ్యంగా చివరి పబ్లిక్ అపియరెన్స్‌లో చెప్పిన “రేపు నేను ఉంటానో లేదో తెలియదు” అనే మాటలు ఇప్పుడు అభిమానుల మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి.


మరిన్ని వార్తలు