డీఈషా ఇండియా 30 ఏళ్ల వేడుక
- హైదరాబాద్‌లో కొత్త కార్యాలయం
- హాజరైన ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): డీఈషా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(D. E. Shaw India Private Limited) భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని నియోపోలిస్‌లో(Neopolis) గ్రావా బిజినెస్ పార్కులో(Grava Business Park) కొత్త కార్యా లయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu), డీఈషా గ్రూప్ ప్రతినిధులు హాజరయ్యారు. డి.ఈ. షా ఇండియా 1996లో హైదరాబాద్‌లో తొలి కార్యాలయాన్ని ప్రారంభించింది.
ప్రస్తుతం హైదరా బాద్‌తో పాటు బెంగళూరు, గురుగ్రామ్‌లో సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. డి.ఈ. షా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు ఎడ్డీ ఫిష్మన్ మాట్లాడు తూ.. గత 30 ఏళ్లలో సాంకేతికత, పెట్టుబ డుల రంగాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా సంస్థ అభివృద్ధి చెందిందన్నారు. అధునాతన డేటా, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలతో పాటు కృత్రిమ మేధస్సు ఆధారిత సాధనాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో 30 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న డిఈషా ఇండియాకు అభినందనలు తెలిపారు. కొత్త కా ర్యాలయం హై దరాబాద్‌పై సంస్థకు ఉన్న దీర్ఘకాలిక నమ్మకానికి, మరింత విస్తరించాలనే నిబద్ధతకు నిదర్శనమన్నారు. 2027లో ప్రారం భం కానున్న కొత్త కార్యాలయం 6 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో నిర్మించనున్నారు. కార్యక్రమంలో డి.ఈ. షా ఇండి యా మేనేజింగ్ డైరెక్టర్, ఆపరేటింగ్ కమిటీ సభ్యుడు చైతన్య గొర్రెపాటి పాల్గొన్నారు.