అభిమానులకు విషాదం.. ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి

07-10-2026 | 05:51pm

తిరుపతి: సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కమెడియన్, యూట్యూబర్ ‘అగ్గిపెట్టి మచ్చ’(YouTuber Aggipetti Maccha) అలియాస్ కిరణ్ కుమార్ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రి(SVIMS Hospital)లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

తనదైన కామెడీ(Comedy) టైమింగ్, ప్రత్యేకమైన మాటతీరు, హావభావాలతో కిరణ్ కుమార్ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ‘అగ్గిపెట్టి మచ్చ’ పేరుతో ఆయన చేసిన వీడియోలు, రీల్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియా క్రేజ్‌తో పాటు పలు టెలివిజన్ కార్యక్రమాల్లోనూ కిరణ్ సందడి చేశారు. ఆయనకు సంబంధించిన వీడియోలు, కామెడీ కంటెంట్‌తో అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది.

అగ్గిపెట్టె మచ్చ కిరణ్‌కు తీవ్ర అనారోగ్యం.. వెంటిలేటర్‌పై చికిత్స, ఆందోళనలో అభిమానులు 

కిరణ్ కుమార్ మృతి వార్తతో ఆయన అభిమానులు, సన్నిహితులు, తోటి కళాకారుల్లో విషాదం నెలకొంది. సోషల్ మీడియా వేదికగా పలువురు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన ‘అగ్గిపెట్టి మచ్చ’.. ఇప్పుడు అభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చారు.

మరిన్ని వార్తలు