అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ సేవలు భేష్

08-10-2026 | 05:25am
  1. వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా 
  2. ప్రముఖ సినీ దర్శకుడు, కవి, నటులు బీ నర్సింగ్‌రావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం
  3. డిజిటల్ సాంకేతికతో సామాజిక లక్ష్యం సాధ్యం: వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి 

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు, డిజిటల్ విద్యపై(Digital Education) ఉన్నత విద్యాసంస్థలు దృష్టి సారించాలని  గవర్నర్, యూనివర్సిటీల ఛాన్సలర్ శివప్రతాప్ శుక్లా(Shivpratap Shukla) పేర్కొన్నారు. బుధవారం డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(BR Ambedkar Open University) 27వ స్నాతకోత్సవానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు ఎంఫిల్, పీహెచ్‌డీ పట్టాలు, బంగారు పతకాలు, బుక్‌ప్రైజ్‌లను(M.Phil. and Ph.D. degrees, gold medals, book prize) ప్రదానం చేసారు. ప్రముఖ సినీ దర్శకుడు, ప్రఖ్యాత కవి, నటులు బీ నర్సింగ్‌రావుకు(B. Narsing Rao) గౌరవ డాక్టరేట్ పట్టాను(Doctorate degree) ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గ్రామీణ, మారుమూల, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి సమత స్కీం కింద ఉచిత విద్యను ప్రవేశపెట్టి వర్సిటీ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి ఇతరులకు ఆదర్శంగా నిలిచారని అభినందించారు. వర్సిటీ నుంచి పట్టభద్రులైన వారిలో సగానికి పైగా మహిళలే ఉన్నారని, బేటీ బచావో బేటీ పడావో నినాదానికి అద్దం పడుతోందన్నారు. ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ దూసుకెళ్తోందని, అందివస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  

డిజిటల్ విద్యతో సామాజిక లక్ష్యం: వీసీ ప్రొ.ఘంటా చక్రపాణి 

డిజిటల్ సాంకేతిక అవకాశాలతో సామాజిక లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నామని వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. గత ఏడాదిగా సాధించిన ప్రగతి భవిష్యత్తుకు బలమైన పునాది వేసిందని పేర్కొన్నారు.  ఈ 27వ స్నాతకోత్సవంలో 23 మంది పరిశోధక విద్యార్థులకు పీహెచ్‌డి, ఒకరికి ఎంఫిల్ డిగ్రీ ప్రదానం చేసారు. యూజీలో 16, పీజీలో 22 మొత్తం 38 బంగారు పతకాలను అందజేశారు. ఆశ్రిత మూడు బంగారు పతకాలు సాధించారు.

రాజమండ్రి సెంట్రల్ జైలుకు చెందిన ఓ ఖైదీ అన్ని సబ్జెక్టులలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణుడై బంగారు పతకం, బుక్ ప్రైజ్ అందుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్నాతకోత్సవంలో మొత్తం 36,145 మంది విద్యార్థులకు డిగ్రీ/పీజీ/డిప్లొమా/సర్టిఫికెట్లు కోర్సుల్లో పట్టాలు  ప్రదానం చేసారు.   న్యాక్ పూర్వ డైరెక్టర్  ప్రొ. వీఎస్ ప్రసాద్, ప్రొ.  వీ నిత్యానంద రావు, బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి, బి. వెంకటేశ్వర్‌రావు, అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్ విజయ కృష్ణారెడ్డి, ఆయా విభాగాల అధిపతులు, డైరెక్టర్స్, విద్యార్ధులు,  ద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు