ప్రభుత్వ బడిలో ఏఐ అభ్యసన కేంద్రం

08-10-2026 | 05:15am

ఏర్పాటు చేసిన ముగ్గురు విద్యార్థులు

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాల(Government school) విద్యార్థులకు డిజిటల్ పరిజ్ఞానం(Digital knowledge), కృత్రిమ మేధపై(Artificial Intelligence) అవగాహన కల్పించేందుకు ముగ్గురు విద్యార్థులు(Students) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కోకాపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్వయం అభ్యసన కేంద్రాన్ని ఆగస్టు 15న ప్రారంభించారు. తొలిదశలో 10 మంది విద్యార్థులకు ఏడాది పాటు డిజిటల్ అక్షరాస్యత(Digital Literacy), ఏఐపై శిక్షణ ఇవ్వనున్నారు. ‘బ్యాలింగ్ బియాండ్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని 11వ తరగతి విద్యార్థులు ఆర్యన్ నడింపల్లి, అక్షయ్ సంధ్యాల, బొల్లినేని రాణా ప్రారంభించారు.

9వ తరగతిలో ఉండగానే గండిపేటలోని ప్రభుత్వ పాఠశాలకు క్రీడా సామగ్రి, నీటి శుద్ధి యంత్రాన్ని అందించడంతో వీరి కార్యక్రమం మొదలైం ది. అనంతరం వారాంతాల్లో ఇంగ్లిష్, గణి తం, సైన్స్ బోధించడం ప్రారంభించారు. గ చ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 30 పునరుద్ధరించిన ల్యాప్టాప్లను అందించింది. వీటిలో 10 ల్యాప్టాప్లను కొకాపేట పా ఠశాల విద్యార్థులు వినియోగిస్తున్నారు. మిగిలిన వాటిని మరో పాఠశాల కార్యక్రమానికి కేటాయించనున్నారు. ఖాన్ అకాడమీ, బ్రిలియంట్ వంటి వేదికల ద్వారా గణితం, సైన్స్, కోడింగ్ ప్రాథమిక అంశాలను బోధించనున్నారు. ఏడాది కాలంలో దశలవారీగా ఏఐ పై అవగాహన కల్పిస్తారు.

ఈ కార్యక్రమానికి కాగ్నోవేట్ సంస్థ మార్గదర్శకత్వం అందిస్తోంది. కేంద్రం ఏర్పాటులో వై-ఫై, ప్రత్యేక గది, ఉపాధ్యాయుల పర్యవేక్షణ, విద్యుత్ సదుపాయాలు, సాఫ్ట్వేర్ నవీకరణలు, తల్లిదండ్రుల అనుమతి, విద్యార్థుల భద్రత వం టి సవాళ్లు ఎదురయ్యాయని నిర్వాహకులు తెలిపారు. కాగ్నోవేట్ మెంటార్ కార్తీక్ మం గు మాట్లాడుతూ.. ఈ ముగ్గురు విద్యార్థులు తరగతులు నిర్వహించే స్థాయి నుంచి స్వ యంగా ఆలోచించే విద్యార్థులను తయారు చేసే వ్యవస్థను నిర్మిస్తున్నారని తెలిపారు. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ క్యాస్ కోఆర్డినేటర్ శాలిని శామ్యూల్ హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు