కన్నాయిగూడెం ఎస్ఐను సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ పుట్ట సతీష్(SI Putta Satish ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన ఎస్ఐ పుట్ట సతీష్ ను శాలువా కప్పి సన్మానించారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు తమ పూర్తి సహకారం ఉంటుందని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.
మండలంలో గంజాయి, మద్యం అక్రమ రవాణా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు సుబ్బుల సమ్మయ్య, మండల సీనియర్ నాయకులు పూజారి కిషోర్, మఠం వెంకటేష్, కావేరి చిన్ని కృష్ణ, నామని తిరుపతి,మంచాల లక్ష్మీనారాయణ,గడ్డం నరేందర్, బండి రవేందర్ మావ్వూరి వెంకన్న, దుర్గం వెంకటయ్య, తడకల జగన్,నరెడ్ల అశోక్,శ్రీరాముల వెంకన్న,తిరుణగారి రామన్న, బొగ్గుల మహేష్, రామ్,గోస్కుల సమ్మయ్య,శ్రీనివాస్, చిట్యాల రాజు, శ్రీరాముల సందీప్. మరియు బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.