పొర్లగడ్డ తండా టు ఫిన్లాండ్..!
గిరిజన ఉపాధ్యాయునికి దక్కిన అరుదైన గౌరవం
ఫిన్లాండ్ విద్యా అధ్యయన పర్యటనకు ఎంపిక
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): ఒక ఖచ్చితమైన లక్ష్యాన్ని ఎన్నుకొని పట్టుదలతో పనిచేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపిస్తున్నారు పొర్లగడ్డ తండాకు చెందిన గిరిజన ఉపాధ్యాయుడు ఉదవత్ లచ్చిరాం(Tribal Teacher Udavat Lacchiram) తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విద్యా అధ్యయన(international educational study) పర్యటనలో భాగంగా ఈ నెల 24 నుండి 31 వరకు ఫిన్లాండ్ పర్యటనకు ఉదవత్ లచ్చిరాం ఎంపికయ్యారు.
పాఠశాలల్లో విద్యార్థుల పెంపు, వినూత్న పద్ధతుల్లో బోధన మార్గాలు అమలు,విద్యార్థుల అభ్యాసన సామర్థ్యం పెంపుకు చేస్తున్న కృషిలో భాగంగా ఆయనకు ఈ పర్యటనలో అవకాశం కలిగింది.ప్రస్తుతం నల్లగొండ జిల్లా భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న లచ్చిరాం ఫిన్లాండ్ పర్యటనకు ఎంపిక కావడం పట్ల బంజారా ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు మధు నాయక్,మోహన్ నాయక్,సురేష్ నాయక్,శంకర్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు.