రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్డీఓ సురేష్

28-11-2026 | 03:19pm

మంథని, నవంబర్ 28 (విజయక్రాంతి): మంథని రెవెన్యూ డివిజన్ పరిధిలోని ముత్తారం మండలం సర్వారం గ్రామ శివారులో కొనసాగుతున్న భూముల రీ సర్వే (Land Resurvey) పనులను మంథని ఆర్డీఓ కె. సురేష్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే (Survey) పనుల పురోగతిని సమీక్షించి, సర్వే బృందంతో పాటు సంబంధిత రైతులతో చర్చించారు.

రైతుల భూములకు సంబంధించిన వివరాల నమోదు (Land Records), సర్వే నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. సర్వే ప్రక్రియలో రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ, భూముల వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ మహేష్, గిర్దావర్లు నరేన్, సాయి, జీపీఓ భాస్కర్, మొగిలి, సర్వేయర్లు, సంబంధిత పట్టాదారు రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు