అకినేపల్లి మల్లారంలో మహా అన్నదానం
ములుగు, (విజయక్రాంతి): గణపతి నవరాత్రోత్సవాల(Ganapati Navaratri celebrations)ను పురష్కరించుకుని మంగపేట మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలో మంగళవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండప వ్యవస్థాపకులు, అకినేపల్లి మల్లారం గ్రామ మాజీ సర్పంచ్ వత్సవాయి శ్రీధరవర్మ రోజా దంపతుల సహకారంతో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి భక్త జనం పోటెత్తారు.
అకినేపల్లి మల్లారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ మహా అన్నదాన కార్యక్రమంలో అకినేపల్లి మల్లారం, అకినేపల్లి మల్లారం ఎస్టీ కాలనీతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని టి.కొత్తగూడెం, చేగర్శల, దుగినేపల్లి, జానంపేట, ముకుందాపురం, భూపతిరావు పేట తదితర ప్రాంతాల నుండి విచ్చేసిన సుమారు రెండు వేల మంది భక్తులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు.