జిల్లాలో మెడికల్ మాఫియా..!

24-11-2026 | 05:20am
  1. అనుమతులు లేకుండా యథేచ్ఛగా మందుల అమ్మకాలు 
  2. ప్రీస్క్రిప్షన్ లేకుండానే విక్రయం
  3. ఆదివాసీ గిరిజనులపై మెడికల్ మాఫియా ప్రయోగాలు..? 

ములుగు, నవంబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలోనే ఆదివాసి గిరిజన(Aboriginal tribe) మాలమూల ప్రాంతంగా పేరున ములుగు జిల్లాలోని(Mulugu District) పలు గ్రామాలలో మెడికల్ మాఫియా(Medical Mafia) యదేచ్చగా రాజ్యమేలుతుంది. అడిగేవారు.. అడ్డుకునేవారు.. లేరనే ధీమాతో మెడికల్ మాఫియా(Medical Mafia) అడ్డగోలు ధరలతో గిరిజనులను అడ్డంగా దోచుకుంటున్నారని విమర్శలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ములుగు జిల్లాలో సుమారు 200 వరకు మెడికల్ షాపులు(Medical shops) కొనసాగుతున్నాయి. అయితే ఇందులో 60 శాతం మెడికల్ షాపులు నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మెడికల్ షాపులు కొనసాగాలంటే లైసెన్స్ తో పాటు ఫామ్ 20 సాధరణ రిటైల్ మందుల విక్రయం, ఫామ్ 21 షెడ్యూల్ సిసి వన్ కేటగిరి చెందిన మందుల విక్రయం ఫామ్ 20 హోల్సేల్ మందుల వ్యాపారం ఫామ్ 21 బి హోల్సేల్ మండల వ్యాపారం సాధారణ మెడికల్ షాప్ అవసరాన్ని బట్టి లైసెన్స్ అవసరం ఉంటుంది. అంతేకాక ఫార్మాసిస్టు రిజిస్ట్రేషన్(Pharmacist Registration) సంబంధిత ఫార్మసీ కౌన్సిల్లో తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. చాలా మెడికల్ షాపులలో ఫార్మసిస్టులు అందుబాటులో ఉండటం లేదు.

కేవలం కొంతమంది మాత్రం లైసెన్స్ ను అడ్డుపెట్టుకొని యదెచ్చగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అంతేకాక డాక్టర్ పిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ యదేచ్ఛగా ఆ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఇటీవల కాలంలో కొంతమంది ఆదివాసి గిరిజన గూడెం ఉన్న గ్రామాలలో ఫార్మా కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తమ మందులను వారిపై ప్రయోగాలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతుంది.

ఏది ఏమైనా జిల్లాలో విచ్చలవిడిగా మెడికల్ మాఫియా రాజ్యమేలుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది అధికారులు మెడికల్ షాపులపై దాడులు నిర్వహిస్తున్న.. అవి నిరంతరంగా కొనసాగకపోవడం మెడికల్ మాఫియాకు కలిసి వస్తుంది. మందుల విక్రయాల్లో సైతం కొంతమంది 10 శాతం మరి కొంతమంది 20 శాతం ఇంకొంతమంది 30 శాతం తక్కువగా మందులు అమ్ముతున్నారు.

మరికొన్ని గ్రామాల్లో ఆర్‌ఎంపీ లే అటువైద్యం ఇటు మందులను సైతం అందజేస్తున్నారు. ఏదేమైనా ములుగు జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం ఎంతోమంది ప్రాణాలకు ఇబ్బందిగా మారింది. ఇకనైనా అధికారులు స్పందించి ఏ మేరకు నిబంధనలు పాటించని మెడికల్ షాపులపై దృష్టి పెడతారో వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు