జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రజలకు చేరువైన పాలన
- మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మేడ్చల్,(విజయక్రాంతి): జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణతో పరిపాలన ప్రజలకు మరింత చేరువైందని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajashekar Reddy) అన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పిలుపుమేరకు ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి కలెక్టరేట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార వికేంద్రీకరణతోనే పాలన ప్రజలకు చేరువై, అభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశం కలుగుతుందన్నారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాల్లోని జిల్లా కేంద్రాలకు వెళ్లి రోజంతా సమయం వెచ్చించాల్సిన పరిస్థితులను తగ్గించాలని ఉద్దేశంతో కేసీఆర్ జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. జిల్లాలు, మండలాలు పునర్వ్యవస్థీకరణ చేసి పాలన ప్రజల చేరువకు చేసిన కేసిఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.