శివాలయాలలో ఎమ్మెల్యే రాగమయి పూజలు

10-10-2026 | 10:06pm

సత్తుపల్లి అక్టోబర్10( విజయక్రాంతి) : పట్టణంలోని గుడిపాడు లోగల శివాలయంలో, బుగ్గపాడు శివాలయం పితృ అమావాస్య సందర్భంగా, సత్తుపల్లి శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్(Sathupalli MLA Dr. Matta Ragamayi Dayanand) పూజల్లో పాల్గొని అర్చకులకు స్వయంపాకం అందించి, శనివారం పూజలు నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ సుఖ,సంతోషాలతో వర్ధిల్లాలని, మహాశివుని దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, అభివృద్ధి చెందాలని కోరారు. ఆమె వెంట ఆలయ కమిటీ సభ్యులు,గ్రామ ప్రజలు ఉన్నారు.

మరిన్ని వార్తలు