సత్తుపల్లి,పెనుబల్లి లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన
సిపిఎం
సత్తుపల్లి/పెనుబల్లి/వేంసూరు. అక్టోబర్. 10.( విజయక్రాంతి ) : సత్తుపల్లి నియోజకవర్గంలోని(Sathupalli Constituency) సత్తుపల్లి,పెనుబల్లి,వేంసూరు మండలాలలో మోడీ ప్రభుత్వం(Modi government) పై శనివారం భగ్గుమన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారి జ్ఞానేష్ కుమార్(Election Commissioner Gyanesh Kumar) బీజేపీ కు,మోడీ సర్కారుకు ఏజెంటుగా వ్యవహరిస్తూ "సర్"(SIR) పేరుతో అక్రమంగా ఓట్లు తొలగించడాన్ని నిరసిస్తూ సిపిఎం శనివారం డిల్లీ జంతర్ మంతర్ లో నిరసన కార్యక్రమాన్ని తలపెట్టింది. అట్టి నిరసనను భగ్నం చేయడం కోసం మోడీ ప్రభుత్వం డిల్లీ పోలీసులతో సీపీఎం జాతీయ కార్యదర్శి ఎంఏ బేబీను,బృందాకారత్ ను,కేంద్ర కమిటీ సభ్యులను అరెస్టులు చేసింది.
ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని,అక్రమ అరెస్టులను ఖండించాలని,జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ సీపీఎం జిల్లా కమిటి ఇచ్చిన పిలుపు మేరకు నియోజక పరిధిలోని సత్తుపల్లి పట్టణంలో రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద, పెనుబల్లి మండలంలోని వి.యం. బంజర అంబేద్కర్ సెంటర్‌లో,వేంసూరు లో సిపిఎం దాని అనుబంధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ నిరసన కార్యక్రమాలు చేశారు.
ఈ సందర్భంగా పాల్గొన్న సిపిఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, చలమాల విఠల్ రావు లు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వాలు, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వారిపై అక్రమ అరెస్టులకు పాల్పడటం సరైన విధానం కాదన్నారు.ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, ప్రజా సమస్యలపై నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న హక్కు అని పేర్కొన్నారు.
అక్రమ అరెస్టుల పేరుతో ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని,వారిపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛను కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.అక్రమ అరెస్టులను ఆపి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు.
ఈ కార్యక్రమంలో: సిపిఎం అనుబంధ రైతు సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు,పట్టణ రైతు సంఘం అధ్యక్షులు మోరంపూడి వెంకటరావు, చావా రమేష్,పెనుబల్లి మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు,సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్,రైతు సంఘం పెనుబల్లి మండల కార్యదర్శి చిట్టి మోదుల కృష్ణయ్య,కండె సత్యం,గుడిమెట్ల బాబు,హమాలి వర్కర్స్ అధ్యక్షులు మిద్దె స్వామి,ఏ.నాగయ్య వెంకటేశ్వరరావు,సేవియా, రాములు,చెన్నారావు, కలకోట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.